నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కళావతి రాథో్ మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్లలో పరిశుభ్రత నాణ్యత ప్రీస్కూల్ కార్యక్రమాలు ఆరోగ్యలక్ష్మి భోజనం అన్ని విషయాల పైన అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పోషణ ప్రతిజ్ఞ అలాగే ప్రీస్కూల్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా పోషణ మాసంలో భాగంగా అన్ని విధాల పోషకాహారాల గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికలు సరైన పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీస్కూల్ ఆటపాటలతో అవకాశాలను కల్పిస్తూ నేర్చుకునే విధంగా ప్రీస్కూల్ కిట్ మెటీరియల్ ను అందించడంతోపాటు అంగన్వాడి టీచర్లు ప్రీస్కూల్ విద్యను ఏ విధంగా పిల్లలకు నేర్పించాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ ఎంపీడీవో , స్పెషల్ ఆఫీసర్ , మద్నూర్ ప్రాజెక్టు పరధిలోని సూపర్వైజర్స్, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొనడం జరిగింది.