విఘ్నేశ్వరా ప్రభూత్వానికి నిద్రమత్తు విడిచి మా సమస్యలు పరిష్కరింప చేయు నాయానా

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్   మండలంలోని యాబై రెండు అంగన్ వాడి కేంద్రాల టీచర్లు, ఆయాలు గత తొమ్మిది రోజులుగా సిఐటీయూ మండల శాఖ ఆధ్వర్యంలో జుక్కల్ మండల శాఖా సిఐటీయూ అంగన్ వాడి సంఘం అద్యక్షురాలు సుమలత టీచర్లు,  ఆయాలతో  కలిసి  వివిధ రూపాలలో బతుకమ్మ, వంటావార్పు, ఎమ్మెలే ఇంటిముట్టడి, అన్నదానం,  ఒంటికాలిపైన నిలబడి నిరసన,  కుటుంబ సబ్యులతో కలిసి నిరసన  కార్యక్రమాలు చెపట్టింది.  ప్రభూత్వం బుద్ది తెచ్చుకుని ఇచ్చిన హమీలు నిలబెట్టుకోని సమస్యలతో కూడిన పదకొండు  డిమాండ్స్ ను నెరవేర్చాలని  నిరదికంగా  విధులకు బహిష్కరించి దర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఎనమిదవ రోజు  వినయక చవితి పండుగ సందర్భంగా దర్నా కేంద్రంలో వినాయక విగ్రహం ప్రతిష్టించి హరతి, పూజలు నిర్వహించి తమకష్టాలు తిర్చాలని , ప్రభూత్వానికి మంచి బుద్ది ప్రసాదించి సమస్యలను పరిష్కరించాలని కోరుతు మెుక్కులు మెుక్కి వినాయక విగ్రహనికి వినతి పత్రం అందించారు. తొమ్మిదవ రోజు మంగళవారం నాడు నిరసన కోన సాగింది. పండుగ పబ్బాలు మానేసి పిల్ల పాపలకు ఇంట్లోనే పెద్ద మనుషుల వద్ద చంటిపిల్లలను వదిలేసి గ్రామం విడిచి దర్నాలో  పాల్గోనెందుకు వస్తున్న టీచర్లు, ఆయాల కుటుంబాల కష్టాలు వర్ణాణతీతంగా ఉంది. ఇప్పడికైన వినాయకుడా విఘ్నాలు తొలగించి ప్రభూత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి ఆలోచన చేసి ఆడబిడ్డలైన మమ్ములను  ని స్వంత బిడ్డలని ఆదుకోవాలని డిమాండ్ పత్రంలో పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మండల అంగన్ వాడి సంఘం నాయకురాలు ఖండేబల్లూర్ సుమలత, దీవేన,  మహమ్మదాబాద్ తాండా లక్ష్మీ, జుక్కల్ చెంచకల,హన్మవ్వ, సాయవ్వ, యశోదా,  మైబాపూర్ రాదా, కే. కల్లాలీ రాదా, నాగల్ గావ్, అంజమణి,   పంచశీల, పెద్దఎడ్గి ప్రేమల, యమున,  పుష్ప,  చిన్నగుల్లా జ్యోతీ,  చండేగాం ప్రేమల, మాదాపూర్ నర్సుబాయి, హంగర్గ జయశ్రీ, కౌలాస్ అంబవ్వ, బాలమణి,   శక్తి నగర్ కంసవ్వ, కత్తల్ వాడి సంగీత, గుండూర్ శకుంతల, పద్మినిబాయి, కంఠాలీతాండా అనితా, బస్వాపూర్ బాగ్యలక్ష్మీ,  డోన్గాం ఈశ్వరి, సోపూర్ సులోచన మరియు హెల్పర్లు తదితరులు పాల్గోన్నారు.
Spread the love