నవతెలంగాణ – కంఠేశ్వర్
వడ్డెర వృత్తిదారులకి గుట్టలపై సొసైటీలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడే ఓబన్న ఆశయాలను నెరవేర్చినట్టు అని వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా సలహాదారుడు వల్లపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం నిజాంబాద్ నాందేవ్ వాడలో చేతి వృత్తిదారుల సంఘం కార్యాలయం ముందు వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా సలహాదారుడు పల్లపు వెంకటేష్ జెండా ఆవిష్కరించారు. అనంతరం పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ వడ్డెర ఓపన్న 218 వ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డెర ఓబన్న, సుబ్బమ్మ సుబ్బన్నలకు జన్మించిన ఓబన్న ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భూమిశిస్తూ వసూలు చేయకుండా ప్రజలకు అండగా నిలబడిన మహా మేధావి స్వతంత్ర సమరయోధుడు అని అన్నారు తన మిత్రుడు సైరా నరసింహారెడ్డి సా రత్యంలో దేశాన్ని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోవాలని దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన నర సింహారెడ్డి వడ్డే ఓబన్న లను టార్గెట్ గా చేసి బ్రిటీ సైన్యంతో దాడి చేయించి ఆ దాడిలో వడ్డే ఓబన్న 39 సంవత్సరాలకే తన ప్రాణాలను బలిసిన అంతర సమరయోధుడు అని కొనియాడారు. ప్రాణాలతో పట్టుకున్న నరసింహారెడ్డిని నల్లమల్ల అడవుల్లో రేనాటిలో ఉరి తీసిన నారు అని అన్నారు. ఆయన ఆశయాలను ఇస్తామని కానీ నేటి పాలకులు అణగారిన కులాలను అణచివేస్తూ వస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని నేటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా వడ్డెర్ల వాటా రిజర్వేషన్ కల్పించాలని గుట్టలపై క్వారీలపై హక్కు కల్పించాలని చదువు లేని వారందరికీ చదువుకోవడానికి కి ప్రభుత్వం ఆర్థిక ప్రభుత్వం ఆదుకోవాలని వడ్డెర ఫెడరేషన్ కి 5000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని అన్నారు. వృత్తి చేస్తున్న వడ్డారులకి కాళ్లు చేతులు విరిగితే ఐదు లక్షలు, చనిపోయినచో 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు వడ్డెర వృత్తిదారులందరికీ ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని 50 సంవత్సరాలు నిండిన ప్రతి వడ్డెర వృత్తిదారుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని నిజాంబాద్ జిల్లాలో ఉన్న వడ్డెర కోపరేటివ్ సొసైటీ లకి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ పనుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు సహకరించాలని రాబోయే రోజుల్లో వడ్డెర ఉత్తరాల సమస్యలపై సమస్యల పోరాటాల నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఈడ గొట్టి ఓడ్డన్న ఉపాధ్యక్షుడు బండారి ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏత్తరి చందర్, పల్లప్ ఎంకటి, కొముర వెంకటి, కంది ఎల్లయ్య, డి గండికోట శీను, తదితరులు పాల్గొన్నారు.