
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో మల్లారం గ్రామంలోని 8వ వార్డులో సిసి రోడ్డును కబ్జా చేసి, రోడ్డును అనుకొని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నేరుడుగొమ్మ కాంతారావు గ్రామపంచాయితి నిబంధనలను ఉల్లగించి ఇటీవల సీసీ రోడ్డుకు కనీసం నాలుగు పిట్లు వదిలిపెట్టకుండా ప్రహరీ పిల్లర్ ను రోడ్డుకు అనుకోని అక్రమంగా గోడ పెట్టిన పరిస్థితి. సీసీ రోడ్డును కబ్జా చేస్తూ అక్రమంగా ప్రహరీ పెట్టడంపై మంగళవారం ఇదే గ్రామానికి చెందిన నేరుడుగొమ్మ సుగుణాకర్ రావు పంచాయతీ కార్యదర్శి రాజు యాదవ్ కు రాతపూర్వకంగా పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుగుణాకర్ రావు మాట్లాడారు. సీసీ రోడ్డును అక్రమంగా కబ్జా చేయడంపై భవిష్యత్ లో ప్రజలు, వాహన దారులు వెళ్లాలంటే ఇబ్బందులకు గురైయ్యే అవకాశం ఉందన్నారు. అక్రమంగా రోడ్డును కబ్జాకు పాల్పడిన కాంతారావుపై జీపీ చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రహరిని వెంటనే తొలగించాలని కోరారు.