వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ ప్రకటించిన ఐసీసీ…

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియాలో హార్డ్ హిట్టర్లకు, డైనమిక్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మన్లకు ఎప్పుడూ కొదవలేదు. కానీ ఆశ్చర్యకర రీతిలో, ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024లో ఒక్క భారత క్రికెటర్ కు కూడా స్థానం లభించలేదు. గత వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన టీమిండియా నుంచి కనీసం ఒక్కరు కూడా ఐసీసీ టీమ్ లో ప్రాతినిధ్యం దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కు కెప్టెన్ గా శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంకను ఎంపిక చేయడం మరో ఆశ్చర్యకర అంశం. వీటన్నింటినీ మించిన షాకింగ్ అంశం ఏమిటంటే… ఈ 11 మంది టీమ్ లో 10 మంది ఆసియా జట్లకు చెందిన ఆటగాళ్లే. షెర్ఫానే రూథర్ ఫర్డ్ (వెస్టిండీస్) ఒక్కడే ఆసియా వెలుపలి ఆటగాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్లకు ఈ టీమ్ లో ప్లేస్ దక్కలేదు.
మహిళల ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024

Spread the love