ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..

నవతెలంగాణ – భువనేశ్వర్‌: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో 43కుపైగా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అదే విధంగా 38 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఖరగ్‌పూర్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా (12480) రైలును జరోలీ మీదుగా పంపించారు. అలాగే వాస్కోడగామా-షాలీమార్‌ (18048) రైలును కటక్‌ మీదుగా పంపించారు. సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ (22850) రైలును కటక్‌ మీదుగా నడుపుతున్నారు. హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌(12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831) రైళ్లను రద్దు చేశారు. ప్రధాని చేతుల మీదుగా శనివారం జరగాల్సిన గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా రద్దు చేశారు.

Spread the love