రాహుల్ గాంధీ పోటీ చేసిన ఓడిస్తా: ఎంపీ నామా నాగేశ్వరరావు

నవతెలంగాణ-హైదరాబాద్ : మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ భవన్ లో జరిగిన భేటీ తర్వాత… నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసిఆర్ ప్రకటించారు. అయితే ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలో తనపై ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ పోటీ చేసినా ఓడిస్తానని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ‘పాతికేళ్లుగా ప్రజాసేవలో ఉన్నా. నాకు గెలుపోటములు కాదు.. ప్రజాసేవ ముఖ్యం అని అన్నారు. మరోసారి ఖమ్మం టికెట్ కేటాయించినందుకు మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు’ అని ఆయన తెలిపారు.

Spread the love