
రెంజల్ మండలం కూనేపల్లి చెరువు గట్టున వన మహోత్సవం పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గౌడ కులస్తులు మొక్కలను నాట కార్యక్రమాన్ని చేపట్టారు. తమ చెరువు గట్టు ఇరు ప్రక్కన మొక్కలు నాటడం జరిగిందని ఎక్సైజ్ శాఖ ఎస్సై జలీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది శ్రీవిద్య, సాగర్, స్థానిక గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్, లింగం గౌడ్, సాయా గౌడ్, నారా గౌడ్, క్షేత్ర సహాయకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.