– గ్రామాల్లో రైతులను దళారులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది
– హెచ్టి విత్తనాలను విక్రయిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం..
– మంథని పట్టణంలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
నవతెలంగాణ – మంథని: కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చేసి తక్కువ ధరకు విత్తనాలు సరఫరా చేస్తామని నమ్మించి రైతులను మోసం చేసే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని మంథని ఎస్సై ఏ. వెంకటేశ్వర్,వ్యవసాయ అధికారిని పి అనుష,సూచించారు.సోమవారం మంథని పట్టణములోని ఫర్టిలైజర్ షాపులలో మంథని వ్యవసాయ శాఖ,టాస్క్ ఫోర్స్,పోలీస్ శాఖలతో కలిసి షాపులలో ఉన్న స్టాక్,లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి విత్తనాలు,కాలం చెల్లిన విత్తనాలు,నకిలీ విత్తనాలపై షాపులను సందర్శించి,పరిశీలించి సోదా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైనా విత్తనాలను కొనేటప్పుడు కంపెనీ పేరు,ఎక్స్పైరీ డేటు,బరువు అన్నిటిని సరిచూసుకొని కొనుగోలు చేయాలన్నారు.హెచ్టీ కాటన్ అమ్మినవారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. షాపులో కానీ,గ్రామాలలో కానీ రైతుల విషయంలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే మంథని వ్యవసాయ అధికారి కార్యాలయం,పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ నెంబర్,లేదా100కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.వారి వెంట మంథని రెండవ ఎస్సై రానివర్మ, టాస్క్ ఫోర్స్ అధికారి మధుసూదన్ రావు,వ్యవసాయ,పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.