నవతెలంగాణ – తాడ్వాయి
వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం చింతల్ క్రాస్, మేడారం పరిసరాల్లోని జంపన్న వాగు ముంపు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు పునరుద్ధం కాకుండా ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని వాగులు చెరువులు కుంటలు నిండుకుండల మారాయని తాసిల్దార్, ఎంపీడీవో, అధికారులు గుంపు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు గ్రామాలను సందర్శించి గర్భిణులకు సేవలు అందించాలన్నారు.
సీజనల్ వ్యాధుల టైం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశానికి తరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రానున్న మూడు రోజులు మరింత ఇష్టమైనవన్నీ అధిక వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, గ్రామపంచాయతీ, వైద్యశాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పి శబరిస్, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, డి.ఎస్.పి ఎం రవీందర్, పస్రా సిఐ గద్ద రవీందర్, స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ అర్రేం లచ్చు పటేల్, మండల గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఆషాడం మల్లన్న, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బత్తిని రాజు గౌడ్, సీతక్క యువసేన అధ్యక్షుడు చర్ప రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, నాయకులు ఇప్ప నాగేశ్వరరావు, పీరీల వెంకన్న, తండాల శ్రీనివాస్, మేడారం యూత్ అధ్యక్షులు రానా రమేష్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.