ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. సోమవారం తాండూర్‌ పట్టణ కేంద్రంలోని డీ ఎస్పీ కార్యాలయం ఆవరణలో తాండూర్‌ సబ్‌ డివి జన్‌ పోలీస్‌ అధికారులతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మా ట్లాడుతూ.. ఎన్నికల విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దన్నారు. తాండూర్‌ సబ్‌డివిజన్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ల్లో పోలీస్‌ సిబ్బందికి ఎక్కడెక్కడ విధులు నిర్వహించాలో బందోబస్త్‌ వివరాలు తెలి పారు. రూట్‌ మొబైల్‌ అధికారులు అప్రమతంగా ఉం టూ అందరు అధికారులతో స మన్వయంతో కలసి పని చేయాలనీ, సున్నితమైన, గ్రామాల్లో బందోబస్త్‌ నిర్వహించే పోలీస్‌ అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్‌ జరు తున్న విషయాన్నీ ప్రజలకు తెలిపాలన్నారు. ప్రశాంత మైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడ లన్నారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ ముర ళీధర్‌, తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, టౌన్‌ ఇన్‌స్పెక్ట ర్‌ రాజేందర్‌ రెడ్డి, కరణ్‌ కోట్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాం బాబు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Spread the love