విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్‌ను నిలిపివేసిన అధికారులు

నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఇవాళ ఉదయం గోవా నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దబోలిమ్‌ విమానాశ్రయంలో ఉదయం 6:45 గంటల సమయంలో టేకాఫ్‌ కోసం రన్‌వేపైకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేసినట్లు విమానాశ్రయంలో సీనియర్‌ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

Spread the love