నవతెలంగాణ-మల్హర్ రావు
ఆదివారం నవతెలంగాణ వరగంల్ వెబ్ ఎడిషన్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ… వృధాగా పోతున్న నీరు అనే సంబంధించిన కథనానికి గ్రిడ్,భగీరథ అధికారులు స్పందించారు. మండలంలోని అరేవాగుపై లికెజైన మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టారు. దీంతో వృధాగా పోతున్న నీరు ఆగింది. సమస్యను వెంటనే పరస్కారం వెబ్ లో ప్రచురించిన నవతెలంగాణ దినపత్రికకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు