మనేదు (రీప్లేస్మెంట్ ) మొక్కలు ఇవ్వబడును: ఆయిల్ ఫెడ్ డీఓ బాలక్రిష్ణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
గత నాలుగేండ్ల క్రితం నూతనంగా ఆయిల్ ఫాం సాగు ప్రారంభించిన రైతులు చావు (రీప్లేస్మెంట్ ) మొక్కలు అవసరం ఉన్నా వారు డివిజనల్ కార్యాలయంలో రైతుకు సంబందించిన వివరాలు తెలిపి నమోదు చేసుకుంటే మొక్కలు అందజేస్తామని టీజీ ఆయిల్ ఫెడ్ డీఓ ఆకుల బాలక్రిష్ణ బుధవారం రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. 2020 – 3021, 2021 – 2022, 2022 – 2023, 2023 – 2024 ఆర్ధిక సంవత్సరాల్లో మొక్కలు తీసుకున్న రైతులు ఎవరికైనా రీప్లేస్మెంట్ మొక్కలు పొందడానికి అర్హులు అని తెలిపారు. పైన తెలిపిన సంవత్సరాల్లో సంబంధిత రైతు ఎన్ని ఎకరాలు సాగు ప్రారంభించారు,ఎన్ని మొక్కలు అవసరం ఉన్నది అనే అంశాలను తెలుపుతూ డివిజనల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Spread the love