నవతెలంగాణ – మల్హర్ రావు
వడదెబ్బతో కావాటి దుర్గమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.స్థానికుల పూర్తి కథనం ప్రకారం శుక్రవారం దుర్గమ్మ ఉదయమే ఉపాధిహామీ కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చింది.మధ్యాహ్నం సమయంలో తలతిరుగుతుందని,వాoతులు,విరేచనాలు చేసుకొని పడిపోవడంతో చికిత్స భూపాలపల్లి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లుగా తెలిపారు.మృతురాలి కుటుంబాన్ని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.అసలే రోహిణి కార్తె కావడంతో తన ప్రతాపాన్ని చూపుతోంది.ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.