విద్యుద్ఘాతం తో వృద్దురాలి ఇల్లు దగ్ధం

నవతెలంగాణ – గోవిందరావుపేట
నిరాశ్రయురాలైన భాదితురాలికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చేయూత మండలం లోని పస్రా పంచాయితీ పరిధిలో గల మొద్దులగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి షాట్ సర్క్యుట్ కావడం తో ఇస్లావత్ బుచ్చమ్మ అనే వృద్దురాలు ఇల్లు పూర్తిగా దగ్ధం అవడంతో ఇంట్లో వున్నవంట సామాగ్రి ,బట్టలు మంచంతో సహా పూర్తిగా కాలి పోయి నిరాశ్రయురాలు అయింది .నిరుపేద కుటుంబానికి చెందిన ఇస్లావత్ బుచ్చమ్మ కూళికి వెళితే కానీ పూట గడవని పరిస్థితి  ప్రక్కనే వుండే స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ కు సమాచారం తెలియజేయగా వెంటనే స్పందంచి శనివారం ఉదయం భాదితురాలిని కలిసి బాడిశ నాగరమేష్ మరియు ట్రస్ట్ సభ్యులు బియ్యం, నిత్యవసరాలు, 4 వేల రూపాయల నగదు ను ఆర్ధిక సహాయంగా అందజేశారు.గ్రామస్తులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారు ఆపదలో వున్న వారికి, పేద వారికి చేస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాసపుత్ర శ్రీకాంత్, రమేష్, దర్మసోత్ దీపక్, రాసపుత్ తేజ, మైలోకి వంశీ, ఆరె ప్రశాంత్, నునావత్ రాజు, భూక్యా సామ్య, గణేశ్, సందీప్ మరియు ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, బాడిశ ఆదినారాయణ, ఇందారపు రమేష్, మునిగెల మహేష్, నరేష్, గుమ్మల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love