రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

నవతెలంగాణ – చివ్వేంల
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన దూరజ్ పల్లి లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దురాజ్ పల్లి  గ్రామానికి చెందిన పొనుగోటి రుక్కమ్మ( 60)  ఉదయం  ఆమె దురాజ్ పల్లి  గ్రామంలో జాతీయ రహదారి పై రోడ్డు దాటుతుండగా  విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపుకు TS08UL2630 నెంబర్ గల కారు డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి  రుక్కమ్మకు ఢీ కొట్టి  వెళ్లిపోగా, తలకు కాళ్లకు చేతులకు ఇతరచోట్ల బలమైన గాయలై అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. కూతురు మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై  వెంకట్ రెడ్డి తెలిపారు.
Spread the love