11న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ నిజామాబాద్ కు రాక

నవతెలంగాణ- కంటేశ్వర్
ఈ నెల 11 న మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్  వస్తున్నారని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సమావేశానికి అన్ని బీసీ కులాల నాయకులు ప్రతినిధులు హాజరు కావాలని విన్నపం  చేసారు. బీసీ కులాల సర్వ సభ్య సమావేశం మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటకు స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొని ప్రతి బీసీ కుల సంఘం వారు తమ తమ సమస్యలను డిమాండ్లను జాజుల శ్రీనివాస్ గారితో విన్నవించుకోవాలని తెలిపారు.జాజుల శ్రీనివాస్ నిజామాబాద్ కు రానున్న సందర్భంలో సన్నాహక సమావేశాన్ని స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు, మాడవేడి వినోద్ కుమార్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, లక్ష్మణ్ గౌడ్, పూల్గం మోహన్, రామకృష్ణ, సంజీవ్, గోపాలకృష్ణ ,రమణ స్వామి, రమేష్, బాలన్న, అనిల్, గోపి, గంగాధర్, మానిక్ రాజు, లక్ష్మీనారాయణ రాజు, సాయిలు, తోట మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love