– కాంగ్రెస్ నిజనిర్దారణ కమిటీ చైర్మెన్‌గా కోదండరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీవో 111 రద్దు నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సూచనమేరకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కమిటీకి పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి చైర్మెన్‌గా వ్యవహరించ నున్నారు. సభ్యులుగా రామ్మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జ్ఞానేశ్వర్, ఆర్థిక వేత్త లుబ్న శర్వాట్, డా. జస్వీన్ జైరథ్ తదితరులు వ్యవహరించనున్నారు.