గాంధీ జయంతి నాడు జైల్లోనే చంద్రబాబు నిరసన దీక్ష

నవతెలంగాణ- అమరావతి: స్కిల్ డెవలప్మెంట్‌ కేసులో తన అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి నాడు రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైల్లోనే ఆయన నిరసన చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన తెలియజేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజున జైల్లో దీక్ష చేయాలని తాము కోరగా ఆయన అంగీకరించారని తెలిపారు. పార్టీ అధినేత నిరసన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దీక్షలు చేపడతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Spread the love