కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల

చాడ సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన జ్ఞానపీఠ అవార్డును గ్రహించి ఉత్తమ సాహితీవేత్తగా పేరుగాంచారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రగతిశీల భావాలకు నిలువుటద్దమని, నిండు హృదయం కలిగిన వారని పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరనిలోటని తెలిపారు. దశాబ్దాలపాటు విశాలాంధ్రలో పనిచేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

Spread the love