ఇంటర్ పరీక్షలు మొదటిరోజు ప్రశాంతం.. నలుగురు విద్యార్థులు గైరాజరు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు లో భాగంగా బుధవారం నాడు ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నలుగురు విద్యార్థులు పరీక్షలకు గైరాజర్ అయినట్లు పరీక్ష కేంద్ర చీఫ్ సూపర్డెంట్ గంగాధర్ విలేకరులకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రోజు 129 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా వీరిలో  నలుగురు విద్యార్థులు గైరాజారిగా ఉండటం 125 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు.
Spread the love