నవతెలంగాణ – బాలానగర్
పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ఆధీనంలో ఉన్న జడ్చర్ల గడ్డ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి అడ్డగా మారింది టిఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా జడ్చర్ల నియోజకవర్గం ఎన్నో అభివద్ధి పనులు చేసినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. జనంపల్లి అనిరుద్ రెడ్డి మార్పుతో ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల ప్రచారంలో అమ్మలను అక్కలను వేడుకున్నారు. జడ్చర్లలో భారీ గజమాలతో స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి భారీ గజమాలతో నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికారు.