నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో మంగళవారం ఆరవ రోజు బడి వాడ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరిస్తూ విద్యాబోధనలో వచ్చిన మార్పుల గురించి వివరించారా 12 మంది విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించడానికి ముందుకు వచ్చారని, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు బి. వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్టియు మండల అధ్యక్షులు టి.సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు కృష్ణ, సాయన్న ప్రభాకర్, రాధా, లక్ష్మీదేవమ్మ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.