– తిరుమల నర్సింగ్ కళాశాలలో అందర గోట్టిన నృత్యాలు..
నవతెలంగాణ: డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామపంచాయతీ శివారులోని తిరుమల నర్సింగ్ కళాశాలలో మంగళవారం కేరళ రాష్ట్రంలో మలయాలిలు వైభవోపేతంగా జరుపుకునే ఓనం పండగ వేడుకలు అంబరాన్ని తాకేలా తిరుమల నర్సింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ పద్మావతి రెడ్డి లు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కళాశాలలో గత 23 ఏళ్లుగా ఓనం పండగ వేడుకలను ఆనందోత్సవాల నడుమ నిర్వహిస్తున్నామని, కేరళ రాష్ట్రంలో ఉండే మలయాలిలు జరుపుకునే సాంప్రదాయం ప్రకారం తిరుమల నర్సింగ్ కళాశాలలో సాంప్రదాయ కార్యక్రమాలు, వంటలు తీసుకునే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం నర్సింగ్ కళాశాల ఆవరణలో ఉట్టి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతిభ, శుభవాణి, విద్యార్థినిలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.