నవతెలంగాణ – తాడ్వాయి
నేరాల నియంత్రణలో గ్రామాల సౌరక్షణలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమని తాడ్వాయి స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి ప్రయోజనాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో నేరగాళ్ల ఆటలు సాగవున్నారు. దొంగతనం కేసులను ఆక్సిడెంట్ కేసులలో శాంతిభద్రతలను విఘాతం కలిగించిన కేసులను ఈవ్ టీజింగ్ కేసులను అనేక కేసులను తక్కువ సమయంలో ఛేదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.