తేప్ప బోల్తా పడి ఒకరి మృతి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ధర్మారం బి గ్రామానికి చెందిన పసుపుల చిన్న సాయిలు 52 బార్దిపుర్ చెరువులో చేపలు పట్టడానికి వేళ్ళి తేప్ప బోల్తా పడటంతో మృతి చెందినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం 4:30 గoటల ప్రాంతంలో చేపలు పట్టడానికి మండలంలోని బార్దిపుర్ గ్రామానికి చెందిన పేద్ద చెరువు కి వెళ్లి చేపలు పట్టుతుండగా ప్రమాదవశాత్తు చిన్న సాయిలు తెప్ప ఉదయం 5:30 గoటల ప్రాంతంలో బోల్తాపడి మృతి చెందినట్లు ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. మృతుని భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు పేర్కొన్నారు.
Spread the love