డివైడర్ ను ఢీకొని వ్యక్తి మృతి

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులోని వాహనాల షోరూమ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ప్రమాద వశాత్తూ డివైడర్ ను ఢీకొని ఒకరు మృతిచెందగా మరోకరికి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోలోని సీతారాం నగర్ కాలనీ కి చెందిన ఆనంతోజు శ్రీనివాస్ 43 అతని స్నేహితుడు సురేష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై డిచ్ పల్లి ఒక పని నిమిత్తం వచ్చి తిరిగి నిజామాబాద్ కు వేళ్తుండాగ మార్గ మధ్యలోని నడిపల్లి గ్రామ శివారులోని స్కోడా వాహనాల షోరూం దగ్గర రోడ్ డివైడర్ ను ప్రమాద వశాత్తూ ఢీ కోనడంతో తివ్ర రక్తస్రావం అయి శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుని వేంట ఉన్న సురేష్ కి తివ్ర గాయాలైనట్లు ఎస్ ఐ మహేష్ తెలిపారు .మృతిని తమ్ముడు ఆనంతోజు ప్రసాద్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్సై మాహేష్ తెలిపారు.
Spread the love