ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని ఆసుపాక కాలనీకి చెందిన కొర్రి సత్యనారాయణ(25) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తన ద్విచక్రవాహనంపై గురువారం అశ్వారావుపేట వస్తున్న నేపధ్యంలో మార్గం మధ్య లోని తిమ్మాపురం సమీపంలో అశ్వారావుపేట వైపు నుండి ద్విచక్రవాహనం ఎదురుగా రాగా అదుపుతప్పి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలు అయి అక్కడిక్కడే మృతి చెందగా, ఏపీలోని ఏలూరు వద్దగల విజయరాయికి చెందిన ఇనపర్తి రాజ్ కుమార్ కు  తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన రాజ్ కుమార్ ను ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి కి తరలించారు.వైద్యులు ప్రధమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు.మృతుడు సత్యనారాయణకు భార్య కావేరి,నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ పీ.శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love