సేవ్‌ ఏపీ అంటూ రాష్ట్రపతికి లక్ష పోస్ట్‌ కార్డులు

నవతెలంగాణ – ఢిల్లీ: చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన లక్ష పోస్ట్‌ కార్డుల ఉద్యమం ఢిల్లీకి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజలు లక్ష పోస్టు కార్డులు రాశారు. ”సేవ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ,సేవ్‌ డెమోక్రసీ” అంటూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లక్ష పోస్టు కార్డులు ఏపీ ప్రజలు పంపించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ”లక్ష పోస్ట్‌ కార్డులు” రాయాలని ఏపీ ప్రజలకు శ్రీకాకుళంకు చెందిన టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. వివిధ వర్గాల నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ సంతకం చేసి రాసిన పోస్ట్‌ కార్డులను రాష్టప్రతి కార్యాలయానికి అప్పలనాయుడు అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ప్రతి ఒక్కరు పోస్ట్‌ కార్డు రాయాలని అప్పలనాయుడు కోరారు.

Spread the love