– గుండాల, తాడ్వాయి అడవుల్లో ఎన్ కౌంటర్
నవతెలంగాణ – తాడ్వాయి
ఈరోజు ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి. నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ సన్నాఫ్ వీరస్వామి (30), గా గుర్తించారు. వీరి స్వస్థలం బుద్ధారం గ్రామం మండలం ఘనపూర్ జిల్లా భూపాలపల్లి గ్రామానికి చెందిన నివాసి. ఈ ఎన్ కౌంటర్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు సరిహద్దుల్లో తాడ్వాయి మడలం అలీగూడెం – బొల్లెపల్లి, దామరతోగు, కౌశెట్టివాయి, సరిహద్దు గ్రామాల్లో కర్రెద్దుల గండి ప్రాంతాల్లో జరిగినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.