
నవతెలంగాణ – పెద్దవూర
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలైన ఘటన మండలం లో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని బహుదూర్ పురాకు చెందిన మునిగల సంజయ్ (19) అను అతను హైదరాబాద్ లోని అవంతి కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం నాడు సంజయ్ మరియు అతని స్నేహితుడైన గాధ సందీప్ (30) అను వారు కలిసి నాగార్జునసాగర్ డ్యాం చూడడానికి గాను వాళ్ళ యొక్క స్కూటీ పై నాగార్జునసాగర్ కు వెళ్ళినారు. తిరిగి వారు హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో రాత్రి సుమారు 7:15 గంటల సమయంలో మండల పరిధిలోలోని పొట్టి వాని తండ సమీపంలోకి వచ్చే సరికి, అదే సమయంలొ పెద్దవూర వైపు నుండి నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఒక గుర్తు తెలియని వాహనం సంజయ్, సందీప్ వెళ్తున్న స్కూటీకి ఢీ కొట్టింది. దాంతో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలైనాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా మార్గ మధ్యలో మునిగల సంజయ్ చనిపోవడం జరిగింది సందీప్ తీవ్రగాయాలతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతిని మేనమామ మాడిశెట్టి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు.