బైక్ అదుపుతప్పి ఒకరు మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ కు చెందిన గడ్డం లింబాద్రి వ్యక్తిగత పనిమీద ద్విచక్ర వాహనంపై డిచ్ పల్లి మండలంలోని ముల్లంగి గ్రామానికి వచ్చి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఇంటికి వెళ్తుండగా ముల్లంగి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతుని భార్య గడ్డం జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్సై వివరించారు.
Spread the love