సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

నవతెలంగాణ – హత్నూర: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవి సహా నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Spread the love