నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

Road-Accidentనవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం, ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి, ఆగి ఉన్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love