ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Fatal road accident.. One person died– దంపతులను ఢీ కొట్టిన లారీ ..
– భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు ..
నవతెలంగాణ – శంకరపట్నం
మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్ రెడ్డి దంపతులు కాచాపూర్ గ్రామం నుండి శనివారం తమ ద్విచక్ర వాహనంపై ఆముదాలపల్లి శివారులో తమ వ్యవసాయ బావి కాడికి పనులపై బయలుదేరి వెళుతుండగా.. మొలంగూర్,వీణవంక ప్రధాన రహదారిపై కాచాపూర్ అడ్డరోడ్డు వద్ద మొలంగూరు వైపు నుండి ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. కాగా గమనించిన స్థానికులు  చికిత్స కోసం ఓ ప్రైవేటు వాహనంలో కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రైతు లింగంపల్లి సుధాకర్ రెడ్డి(70) మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన ఆయన భార్య సుజాతను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Spread the love