– ప్రమాదం జరిగినట్టు చిత్రీకరణ
– పోలీసుల విచారణలో విషయాల వెలుగులోకి
– కేసు చేధించిన ఎస్‌ఐ రవూప్,పోలీస్ సిబ్బందికి అభినందన
– నిందితులకు రిమాండ్
– విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ శ్రీధర్‌రెడ్డి
నవతెలంగాణ-కోడంగల్
గుప్త నిధుల ముఠా తవ్వకాలలో బండరాయి పడి వ్యక్తి మతిచెందాడు. అయితే దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రకరించేందుకు యత్నం చేశారు. చివరకు పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సోమవారం కొడంగల్‌లోని సీఐ శ్రీధర్ రెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గుప్త నిధుల వేటలో దోమ మండలం, దాదాపుర్ గ్రామానికి చెందిన సత్యప్ప మృతదేహం బోంరాస్ పేట్ మండలం నాందాపూర్ గ్రామ శివారులోని బ్రిడ్జి కింద శరీరం కుళ్లిపోయిన స్థితిలో పడి ఉండగా స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని కుమారుడు నరేశ్ బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పోలస్ సత్యనారాయణ నల్లగొండ, భువనగిరి జిల్లాలలో ఐదు సంవత్సరాలుగా గుప్త నిధులు తవ్వుతూ ఆ ప్రాంతంలో దొరకకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లా సల్కర్ పేట్ గ్రామనికి మాఖం మార్చి సల్కర్ పెట్ గుట్టలో ఏనుగు బొమ్మ, రాతి కట్టడం చెరువు తుమ్ ఉంటే నిధి ఉంటుందని తెలిసిన గురువు ద్వారా తెలుసుకొని ఏడాదిన్నర నుంచి ఎలాగైనా నిధిని సొంతం చేసుకోవాలని ఆలోచనతో సత్యనారాయణ తన ఇంటి దగ్గర ఉండే శర్మ, సుందరయ్య, సైదులకు చెప్పి నిధిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. నలుగురుతో సాధ్యం కాదని భావించి నారాయణపేట జిల్లా నాగసాని పల్లి గ్రామం కోస్గి మండలానికి చెందిన శంకరయ్య, సల్కర్ పేట గ్రామస్తుడు నాగరాజు, వెంకటయ్యలను కలుపుకొని నిధి తవ్వెందుకు అంగీకారానికి వచ్చారు. నిధిని తవ్వెందుకు కావలసిన మూడు పారాలు, మూడు గడ్డపారలు, రెండు గంపలు, ఒక బ్యాటరీ అందరూ కలిసి తెచ్చుకున్నారు. తూము గుండా లోపలికి దిగి చూడగా అక్కడ అంత చీకటి ఉండడంతో పాటు ఊపిరి ఆడడం కష్టంగా ఉంది, నిధి కోసం తవ్వే సమయంలో పైన ఉన్న తూము రాలు మీద పడితే చనిపోయే విధంగా ఉన్న నిధి పై ఆశతో ఎలాగైనా నిధిని తవ్వాలని నిర్ణయించుకున్నారు. నిధిని తవ్వుతుండగా అటువైపు ఎవరన్నా వస్తున్నారా అని కాపాలాగా శంకరయ్య, నాగరాజు ఉండేవారు. కొంత సమయం నలుగురు నిధిని తవ్వుతూ మరికొంత సమయం మరో నలుగురు నిధిని తవ్వేందుకు ఒప్పందం కుదుర్చుకొని గురువు చెప్పినట్టు 18 ఫీట్లు తూము గుండా లోపలికి వెళ్లి తవ్వగా ఎలాంటి నిధి లభించడం లేకపోవడంతో కొన్ని రోజులు ఆపేసి. మరల మే నెల మొదట్లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షకిల్‌ను తీసుకుని వచ్చి చూపించగా అటు తవ్వితే నిధి దొరకదని దానికి అడ్డంగా పోతే నీది దొరుకుతుందని చెప్పడంతో అందరూ సమాన భాగం తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. 17 మే 2024 మధ్యాహ్నం సమయంలో నిధి కోసం తవ్వుతుండగా రాయి కూలీ సత్యప్ప మీద పడడంతో సత్యప్ప అక్కడికక్కడే మతి చెందడంతో కాపలాగా ఉన్న శంకరయ్య, నాగరాజులకు వెంటనే విషయం చెప్పగా అక్కడికి వెళ్లి వెంటనే శవాన్ని బయటకు తీశారు. ఇక్కడే ఉంటే అందరిపై అనుమానం వస్తుందని భావించి సత్యప్ప బైకుతో ఏదైనా కల్వర్టుకు యాక్సిడెంట్ అయినట్టు చిత్రీకరిద్దామని అనుకొని అదే రోజు రాత్రి రెండు గంటల సమయంలో టీఎస్ 07 హెచ్ ఎక్స్ 3746లో సత్యప్ప మృతదేహాన్ని బోంరాస్‌పేట్ మండలం నాందర్‌పూర్ గ్రామ శివారులో ఒక కల్వర్టు దగ్గర ఎవరు లేనిది చూసి సత్యప్ప బైకుతో సైదులు కల్వర్టుకు నాలుగు, ఐదు సార్లు గుద్ది, సత్యప్పను బైకుపై కూర్చోబెట్టి యాక్సిడెంట్ అని నమ్మించెందుకు కల్వర్టుపై నుంచి కిందికి తోశారు. పోలీసులు విచారణలో భాగంగా శంకరయ్యను బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా తాను చేసిన నేరము ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితులను అందరిని విచారించగా నేరము ఒప్పుకోవడంతో వారి దగ్గర ఉన్న కారు, సెల్‌ఫోన్లు, సామాగ్రిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి 8 మంది నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. మూడవ నమ్మకాలను నమ్మి ఇలాంటి వాటిని కొని తెచ్చుకోవద్దని సీఐ తెలిపారు. కేసును చేదించిన బోంరాస్ పేట్ ఎస్‌ఐ పోలీస్ సిబ్బందికి సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో బొంరాస్ పేట్ ఎస్‌ఐ రవూప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.