కారుబోల్తా.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..

నవతెలంగాణ – మోపాల్
యాచారం గ్రామానికి చెందిన మలవత్ ప్రభాకర్ అనే వ్యక్తి తన భార్య లలిత బాయితో కలిసి తన ఆరోగ్యం దృష్ట్యా నిజమబాద్ లోని ఆసుపత్రి నందు చూపించుకోవడానికి మంగళవారం బయలుదేరారు. తిరుగుప్రయాణంలో అమ్రాబాద్ గ్రామ శివారు అడవి ప్రాంతంలో కి చేరుకోగా అకస్మాత్తుగా ఒక అడవి జంతువు తన కారు ముందు నుండి వెళ్లిపోగా దానిని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద బండరాయిని తన వాహనం ఢీకొనడంతో కారు బోల్తా పడింది. దీంతో తన భార్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. ప్రభాకర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన కుటుంబసభ్యులు తల్లి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని తన కుమారుడు గాయాలతో ఉండగా కోడలు అప్పటికే చనిపోగా.. కుమారుడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కోడల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అత్త హేమ భాయ్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు.
Spread the love