ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

నవతెవలంగాణ – వరంగల్: ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్‌ లైటింగ్‌ పోల్‌ను ఢీకొట్టడంతో ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని దుర్మరణం చెందగా.. మిగిలిన ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love