వరి కుప్పపై పడి ఒకరికి తివ్ర గాయాలు..

– రోడ్లపైన వరి ధాన్యాం ఆరబోస్తే చట్ట ప్రకారం చర్యలు: ఎస్సై యు మహేష్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
వరి కుప్పపై పడి ఒకరికి తివ్ర గాయాలైన సంఘటన డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్సై యు మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఖిల్లా డిచ్ పల్లి నుండి రైల్వేస్టేషన్ కు వచ్చే దారిలో కోందరు రైతులు  రోడ్లపైన వరి ధాన్యాం ఆరబోసరని, రాత్రి సమయంలో మండలం లోని అమృతాపూర్ గ్రామానికి చెందిన కుందేటి శ్రీకాంత్ ఖిల్లా డిచ్ పల్లి గ్రామం నుండి అమృతాపూర్ గ్రామానికి వస్తుండగా రోడ్డుపైనా ఉన్న ధాన్యం  కుప్పగా పోసి  ఉండడంవల్ల అమృతాపూర్ గ్రామానికి చెందిన కుందేటి శ్రీకాంత్ ప్రమాద వశాత్తు పడటంతో తివ్ర గాయాలపాలై నట్లు ఎస్సై వివరించారు.ఈ ఘటనా విశయమై బాదితుడి భార్య కుందేటి వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రజలందరికీ విజ్ఞప్తి… 
రైతులు రోడ్లపైన  వడ్లను కానీ ఇతర ధాన్యాన్ని గాని ఆరబోయకూడదని ఆరబోసినట్లయితే చట్టప్రకారం తగు చర్యలు తీసుకోబడుతుందని, ఇప్పటికే పలువురు కుప్పలపై పొడి గాయాలైన సంఘటనలు అనేకంగా ఉన్నాయని ఎస్సై యు మహేష్ తెలిపారు.
Spread the love