నవతెలంగాణ-శంకరపట్నం : కారు-బైక్ ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన, మునిగంటి ఐలయ్య,( 55 ) సోమవారం తన అవసరం నిమిత్తం శంకరపట్నం వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వస్తుండగా, మొలంగూర్ బీసీ కాలనీ వద్ద వెనుక నుండి కారు ఢీకొట్టడంతో, ఐలయ్య,తలకు మరియు వీపు భాగాన తీవ్రంగా గాయాలై రోడ్డు మీద పడడంతో స్థానికులు చూసి 108 కి ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి,పైలెట్ మతి గోపికృష్ణ, సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని అంబులెన్స్ లోనికి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు, తెలిపారు.