– అదనంగా నిర్మించాలని అధికారులకు ఆదేశం
– ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి
నవతెలంగాణ-మద్దూరు
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌ను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉన్న సమస్యలను ప్రిన్సిపల్ సురేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో విద్యార్థుల వివరాలు, అధ్యాపకుల వివరాలను, మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు టాయిలెట్స్ లేకపోవడంతో వెంటనే నూతన టాయిలెట్స్ నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమన్నారు. వెంటనే విద్యార్థుల కోసం రూ.13.80 లక్షలతో నూతన టాయిలెట్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట సిద్దిపేట జిల్లా డీఐ ఈవో సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.