దొంగతనం కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష

నవతెలంగాణ- సిరిసిల్ల
రెండు దేవాలయాలతో పాటు ఓ ఇంటిలో చోరీ చేసిన  కేసులో 1సంవత్సరం జైలు శిక్షతో పాటు 100/- రూపాయలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువడిoచారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 17 జూన్ 2023 రోజున తారాకరామ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో హుండీ తాళం పగలగొట్టి అందులోని డబ్బులను దొంగిలించారని  మిట్టపల్లి రాములు పిర్యాదు చేశారు  15 సెప్టెంబర్ 2023 వెంకంపేటకు చెందిన గడ్డం శ్రీధర్ ఇంటిలో  సెల్ ఫోన్ దొంగతనం జరిగింది  24 జూన్ 2023 రోజున బి వై. నగర్ లో హనుమాన్ దేవాలయంలో గల  హుండీనీ పగులగొట్టి అందులోని డబ్బులను దొంగిలించిన కేసులో ఆలయంలో చోరీ జరిగిందని ఆలయ చేర్మెన్  గజ్జెల్లి రామచంద్రం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  వారి పిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో  భాగంగా చోరీ చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన వద్ది చెంగప్ప సుబ్రమణ్యం ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు విచారణ అనంతరం  విచారణ అధికారి ఎస్. మల్లేశం  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు. ఎస్సై లావుడ్య శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్  ద్యారా నిందితుడు మూడు కేసులలో నేరంను  కోర్టులో అంగీకరించటంతో కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్  నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 100 రూపాయల జరిమానా  విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్  తెల్పారు.

Spread the love