కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

– మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
– సమస్యలు పరిష్కరించాలని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు తల్లోజీ ఆచారికి వినతి
నవతెలంగాణ-తలకొండపల్లి
వివిధ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు తల్లోజీ ఆచారి అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె మంగళవారంతో 9వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం వారు వివిధ డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని తల్లోజీ ఆచారికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవి గౌడ్‌, జిల్లా కార్యదర్శి పాండు ప్రసాద్‌, ఎంపిటిసి హేమరాజు, ఉప సర్పంచ్‌ పద్మ అనిల్‌, బీజేవైయం నాయకులను రాష్ట్ర కార్యదర్శి నీలకంఠం పాండు, శ్రీకాంత్‌,యాదయ్య, శాంతకూమారి, అంగన్‌వాడీ టీచర్లు యాదమ్మ, చంద్రకళ, స్వరూప, గిరిజ, వసంతలక్ష్మి, పద్మ, రాజమణి ,శైలజ, దేవి, నిర్మల, ఆయా అమ్ములు భారతమ్మ, శ్రీదేవి, సర్వస్వతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love