మణిపూర్‌.. కుకీలపై కొనసాగుతున్న దాడులు

నవతెలంగాణ- ఇంఫాల్‌: మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఉదయం జరిగిన దాడిలో కుకీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాంగ్‌పోక్పీ జిల్లాలోని నిషేధిత ఉగ్రవాద గ్రూపు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంఫాల్‌ వెస్ట్‌, కాంగ్‌పోక్పీ జిల్లాల సరిహద్దులోని ఇరెంగ్‌ మరియు కరం ప్రాంతాల మధ్య ఉన్న గ్రామస్తులపై దాడి చేసినట్లు తెలిపారు. వాహనంపై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. ఈ ఏడాది మే 3 నుండి మణిపూర్‌గాణలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు.

Spread the love