నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagarనవతెలంగాణ – నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 3,23,965 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 584.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 295.99 టీఎంసీలకు చేరుకుంది.

Spread the love