విద్యార్థి ని బలిగొన్న “ఆన్ లైన్ గేమ్స్”

నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసగా మారడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక 10వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మై హోమ్ భూజాలోని జె బ్లాక్ లో తల్లిదండ్రులతో పాటు రేయాన్ష్ రెడ్డి (14) నివాసం ఉంటున్నారు. ఇతను ఓక్రిడ్జ్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. తరచుగా ఫోన్లు చూస్తూ.. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస కావడంతో పాటు చదువులో ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు.  ఒత్తిడితో ఈరోజు జె బ్లాక్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love