నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. ఒకవేళ వేసినా ఆ ఓట్లు చెల్లవు. కానీ సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర క్యూలో నిలబడితే మాత్రం ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. కనుక ఎన్నికల నియామవళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేదంటే ఓటు హక్కును కోల్పోతారు.