ఇవాళ్టి నుంచి ఆస్పత్రుల్లో ఒపీ సేవలు బంద్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ్టి నుంచి పీహెచ్‌సీ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ కానున్నాయి. పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సేవలు బహిష్కరించినట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం తెలిపింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తామని పీహెచ్‌సీ వైద్యుల సంఘం తెలిపింది. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. రేపు ఛలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని, మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపింది.
Spread the love