ఓపెన్ కానీ ఖరగ్ పాఠశాల..

– ఈ పాఠశాలకు దిక్కు ఎవరు
– గత ఏడాది మూడు నెలలు తెరవని పాఠశాల
నవతెలంగాణ ప్రచురితంతో ప్రభుత్వ స్పందన
ఈ ఏడాది పాఠశాలల ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్న ఓపెన్ కానీ పాఠశాల
– స్పందించిన ఎంఈఓ రాములు నాయక్
నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ మండలంలోని మహారాష్ట్ర ప్రాంతానికి పూర్తిగా బార్డర్లో గల ఖరగ్ ప్రాథమిక పాఠశాల ఓపెన్ కావడం లేదు. ఈ పాఠశాలకు దిక్కు ఎవరు అనే చర్చలు వినబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 12న ప్రారంభమయ్యాయి. కానీ ఖరగ్ పాఠశాల ఇంతవరకు ఓపెన్ కాకపోవడంతో ఆ గ్రామ విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభోత్సవంలో ఈ పాఠశాల ప్రారంభానికి నోచుకోలేక గత ఏడాది నవతెలంగాణ గ్రామాన్ని సందర్శించి, మూతబడ్డ పాఠశాల తెరవలేక, గ్రామానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు పంపవలసి వస్తుందని, ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా విద్యాశాఖ ఏమాత్రం పట్టించుకోకపోవడం కరగ్ పాఠశాలకు దిక్కు ఎవరు అనే సందిగ్ధంలో ఆ గ్రామస్తులు పడిపోయారు.
పాఠశాలలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచిన ఈ పాఠశాల తెరుచుకోలేక పోతుంది. మూతబడ్డ పాఠశాల గురించి నవ తెలంగాణ మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ కు ఫోన్ ద్వారా వివరణ కోరగా, ఆ పాఠశాలకు డిప్టేషన్లో ఒక టీచర్ ఉన్నారని, ఆయన ఎందుకు పోవడం లేదో ఇంతవరకు నా దృష్టికి రాలేదని, మీరు నా దృష్టికి తెచ్చినందుకు ఒక టీచర్ని వచ్చే మంగళవారం లేదా బుధవారం పంపించడం జరుగుతుందని సమాధానం ఇచ్చారు. విద్యాశాఖ అధికారుల పనితీరు చూస్తుంటే ఈ మారుమూల గ్రామ ప్రాథమిక పాఠశాల గత రెండు సంవత్సరాలు కాలంగా మూతపడే విధంగా అధికారుల పనితీరు కనిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది మూడు నెలల తర్వాత నవతెలంగాణ ఆ గ్రామాన్ని సందర్శించి, వార్తను ప్రచురితం చేయడంతో, కలెక్టరు ఆదేశాల మేరకు టీచర్ను పంపడం జరిగింది. ఈయడాది కూడా పాఠశాలల ప్రారంభం రోజున ఈ పాఠశాల తెరుచుకోలేదు. నాలుగు రోజులైనా పాఠశాలకు దిక్కెవరు అనే విధంగా, ఏ ఒక్క టీచర్ని కూడా అక్కడికి పంపడం లేక గ్రామంలో గల చిన్నారి విద్యార్థిని విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల గతి ఇంతే ఉంటుందని ఆవేదనతో గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టిన ఖరగ్ పాఠశాల మూతబడి ఉండటం ఏమిటనే చర్చ ఆ గ్రామస్తులు వ్యక్తమౌతుంది. అసలు విద్యాశాఖ ఈ మండలంలో పనిచేస్తుందా లేదా అని ఆవేదన గ్రామస్తులు వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యాధికారుల పైన చట్టరీత్య చర్యలు తీసుకొని పాఠశాల తెరిపించాలని ఆ గ్రామస్తులు ఆవదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love